BREAKING
మంత్రి "ఆనం" ఇలాకాలో పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవాలు ఉపసంహరణల ఘట్టంలోనే 48 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం *ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డికి ఘనంగా సన్మానించిన కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లన్న పాటిల్* *కోహీర్ నుంచి జహీరాబాద్‌కు అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలి* కార్తీక పౌర్ణమి వేళ కేతకి సంగమేశ్వరుడి ఆలయానికి పోటెత్తిన భక్తులు మొక్కు తీర్చుకునేందుకు యాదగిరిగుట్టకు పాదయాత్ర *నాగిరెడ్డిపల్లిలో చేయూత పెన్షన్లు, కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ* సంగారెడ్డి ప్రజల దాహం తీర్చాలి.. లేదంటే వాటర్ వార్‌కు సిద్ధం! అద్దంకి నియోజకవర్గంలో కూటమి జోరు.. ఐదు మండలాల్లో 37 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం. అయ్యప్ప స్వాములకు సంక్రాంతి వరకు అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన సాహితీ రాము… *సమాచార హక్కు చట్టంతో ప్రజలకు ప్రశ్నించే అధికారం* హుస్సేల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల రైడ్ అప్పుల బాధతో యువ రైతు బలవన్మరణం వెల్దుర్తి మండలం రామళ్లకోటలో విషాదం శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు *కార్తీక పౌర్ణమి సందర్భంగా రాచణ్ణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం* ప్రసన్నాంజనేయునికి వైభవంగా లక్ష తమలపాకుల పూజ.

హుస్సేల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల రైడ్

Select Suryaa Now
హుస్సేల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల రైడ్

న్యాల్‌కల్;న్యాల్‌కల్ మండలం హుస్సేల్లి గ్రామంలో రహస్యంగా నడుస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు.తేదీ 24/11/2026 నాడు హుస్సేల్లి గ్రామ పరిధిలో మల్లయ్య కిరాణా షాపు గల ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు హద్నూర్ ఎస్సై డి. సుజిత్ మరియు సిబ్బంది కలిసి రైడ్ చేశారు.పోలీసులు వెళ్ళేసరికి అక్కడ 18 మంది జూదరులు పేకాట ఆడుతూ కనిపించారు. పోలీసులు వారిని పట్టుకుని, పంచుల సమక్షంలో 52 పేకాట ముక్కలను, రూ. 24,170 డబ్బులను మరియు వారు వాడుతున్న 19 మొబైల్ ఫోన్లను స్వాధీనపరచుకొని కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ - ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు ఎవరు చేసినా చట్టాన్ని అనుసరించి వారిపై తగిన చర్య తీసుకుంటాం. గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే జూదం, పేకాట లాంటి వాటిని అరికట్టడానికి ఇలాంటి దాడులు కొనసాగుతాయి" అని హెచ్చరించారు.నేర నివారణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, ఇటువంటి నేరాలు జరగకుండా పోలీసులకు ముందస్తు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.