BREAKING
కార్తీక మాసం సందర్భంగా కేతకీ సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు *మాజీ సీడీసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కాసాల బుచ్చిరెడ్డి జన్మదిన వేడుకలు* వాసిలి సర్పంచ్ గా సుంకర చౌదరి దివ్య కాంతులతో కార్తీక పౌర్ణమి..! వేదగిరి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచామృత అభిషేకాలు పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య *ప్రజల సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం* మంత్రి "ఆనం" ఇలాకాలో పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవాలు ఉపసంహరణల ఘట్టంలోనే 48 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం *ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డికి ఘనంగా సన్మానించిన కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లన్న పాటిల్* *కోహీర్ నుంచి జహీరాబాద్‌కు అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలి* కార్తీక పౌర్ణమి వేళ కేతకి సంగమేశ్వరుడి ఆలయానికి పోటెత్తిన భక్తులు మొక్కు తీర్చుకునేందుకు యాదగిరిగుట్టకు పాదయాత్ర *నాగిరెడ్డిపల్లిలో చేయూత పెన్షన్లు, కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ* సంగారెడ్డి ప్రజల దాహం తీర్చాలి.. లేదంటే వాటర్ వార్‌కు సిద్ధం! అద్దంకి నియోజకవర్గంలో కూటమి జోరు.. ఐదు మండలాల్లో 37 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం.

కార్తీక పౌర్ణమి వేళ కేతకి సంగమేశ్వరుడి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Select Suryaa Now
కార్తీక పౌర్ణమి వేళ కేతకి సంగమేశ్వరుడి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఝ‌రాసంగం;కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని ప్రసిద్ధ శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. భక్తులు అమృత గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. శ్రీ కేతకి సంగమేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించగా, అనంతరం అమృత గుండంలో దీపారాధనతో పాటు గంగాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర క్షేత్రం పురాతన శైవక్షేత్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. కార్తీక మాసంలో శివారాధన, దీపారాధన, పుణ్యస్నానాలకు విశేష ప్రాధాన్యత ఉండటంతో ఈ పర్వదినం సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమాలను ఆలయ చైర్మన్ శ్రీ ఈ. చంద్రశేఖర్, కార్యనిర్వహణాధికారి శ్రీ వి. శివరుద్రప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు, అర్చక బృందం, ఆలయ సిబ్బంది కార్యక్రమాల నిర్వహణలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.