కార్తీక మాసం సందర్భంగా కేతకీ సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు
ఝరాసంగం; కార్తీక మాస పవిత్ర సందర్భంగా ఝరాసంగం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవం, దీపారాధన, గంగా హారతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో శివారాధనకు విశేష ప్రాధాన్యత ఉండటంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీపారాధనలు, ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయ పరిసరాలు భక్తిభావంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ, కార్తీక మాసం ఆధ్యాత్మిక చింతనకు, భక్తిభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్, మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు జగదీష్, గ్రామ సర్పంచ్ వినోద బాల్ రాజ్, సర్పంచ్‌లు కృష్ణ, సోహెల్, జైపాల్ రెడ్డి, నాయకులు ఏజెస్ బాబా, నాగేష్ సజ్జన్, శ్రీను పటేల్, కేతన్, ప్రవీణ్, జగదీష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.