BREAKING
ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఎల్లంపల్లి మురళి పలమనేరు ఆర్టీసీ కార్గోలో ఎలుకల బెడద డ్రై ఫ్రూట్స్ పార్సెల్ ధ్వంసం.. వినియోగదారుడికి నష్టం శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి బసిరెడ్డిపల్లి, బాలాయపల్లి పంచాయతీ లు ఏకగ్రీవం- గుర్రం శ్రీనివాసులు శబరి శ్రీరామ క్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు.... కృష్ణానదిలో పుణ్యస్నానాలు.. ఆలయాల్లో కార్తీక దీపాల వెలుగులు కార్తీక మాసం సందర్భంగా కేతకీ సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు *మాజీ సీడీసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కాసాల బుచ్చిరెడ్డి జన్మదిన వేడుకలు* వాసిలి సర్పంచ్ గా సుంకర చౌదరి దివ్య కాంతులతో కార్తీక పౌర్ణమి..! వేదగిరి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచామృత అభిషేకాలు పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య *ప్రజల సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం* మంత్రి "ఆనం" ఇలాకాలో పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవాలు ఉపసంహరణల ఘట్టంలోనే 48 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు.... కృష్ణానదిలో పుణ్యస్నానాలు.. ఆలయాల్లో కార్తీక దీపాల వెలుగులు

Select Suryaa Now
కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు....   కృష్ణానదిలో పుణ్యస్నానాలు.. ఆలయాల్లో కార్తీక దీపాల వెలుగులు
 
 
అవనిగడ్డ, మేజర్ న్యూస్: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అవనిగడ్డ లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో కృష్ణానదికి చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం శివాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన పౌర్ణమి కావడంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు, యువతులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని దీపారాధనలు చేశారు. ఆలయ ప్రాంగణాల్లో దీపాలను వెలిగించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా ఉసిరి, రావి తదితర పవిత్ర వృక్షాల వద్ద దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేశారు. స్థానిక రాజరాజేశ్వరి సమేత రాజశేఖర్ స్వామి ఆలయంతో పాటు మండల పరిధిలోని వేకనూరు, దక్షిణ చిరువోలులంక, పులిగడ్డ, మోదమూడి లోని శివాలయాల్లో 
సాయంత్రం వేళ ఆలయాల వద్ద కార్తీక దీపోత్సవాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేలాది దీపాల కాంతులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కుటుంబ సమేతంగా భక్తులు పాల్గొని కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఆలయాల్లో భక్తుల సందడి కొనసాగింది.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.