పలమనేరు ఆర్టీసీ కార్గోలో ఎలుకల బెడద డ్రై ఫ్రూట్స్ పార్సెల్ ధ్వంసం.. వినియోగదారుడికి నష్టం
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు పట్టణంలోని ఆర్టీసీ కార్గో కార్యాలయంలో పార్సెల్స్ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కార్గో ద్వారా పంపించిన డ్రై ఫ్రూట్స్ పార్సెల్‌ను ఎలుకలు కొరికేయడంతో వినియోగదారుడు నష్టపోయాడు.బాధితుడికి చేరిన పార్సెల్ ప్యాకింగ్ చిరిగిపోయి ఉండటంతో పాటు, అందులోని డ్రై ఫ్రూట్స్‌ను కూడా ఎలుకలు కొరికినట్లు గుర్తించారు. దీంతో ఆర్టీసీ కార్గో సేవలపై వినియోగదారుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.కార్గో కార్యాలయంలో పార్సెల్స్‌ను భద్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయంలో పరిశుభ్రతను మెరుగుపరిచి, ఎలుకల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు ఘటనపై విచారణ జరిపి, బాధితుడికి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అనిల్ కుమార్ యాదవ్