BREAKING
ఆర్ఆర్ఆర్ నాటు నాటు హుక్‌స్టెప్‌తో బీటీఎస్ వీ సందడి? అభిమానుల్లో ఉత్కంఠ! కార్తీక పౌర్ణమి వేడుకలు.. దనకొండేశ్వర స్వామి కొండపై భక్తుల దీపారాధన తుంగభద్ర నదీతీరంలో వైభవంగా పుణ్యహారతి.. లక్ష దీపోత్సవం గేటు వద్ద అడ్డుకున్న మేనేజర్.. కింద కూర్చుంటానన్న కోడి రామకృష్ణకు సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చిన సర్‌ప్రైజ్ ఇదే! కొంగటంలో కూటమి అభ్యర్థి విజయ్ కుమార్‌ను గెలిపించండి విజయం సాధిస్తే పంచాయతీ అభివృద్ధికి కోటి రూపాయల విరాళం – కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి ఓం శక్తి మహిళా భక్తులకు ఆరు రోజుల ఉచిత పుణ్యక్షేత్రాల యాత్ర నేను చనిపోయినా బతికే ఉంటాను.. ఏఐ డిజిటల్ క్లోన్‌పై ఆర్జీవీ సంచలన పోస్ట్ తరుణ్ భాస్కర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో ఉండేవాడినే కాదు.. 'ఈఎన్‌ఈ రిపీట్' వేడుకలో విశ్వక్ సేన్ ఎమోషనల్ స్పీచ్ వీ.కోటలో కూటమి అభ్యర్థి మధుకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం దర్శి లో 34 గ్రామపంచాయతీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఎల్లంపల్లి మురళి పలమనేరు ఆర్టీసీ కార్గోలో ఎలుకల బెడద డ్రై ఫ్రూట్స్ పార్సెల్ ధ్వంసం.. వినియోగదారుడికి నష్టం శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి బసిరెడ్డిపల్లి, బాలాయపల్లి పంచాయతీ లు ఏకగ్రీవం- గుర్రం శ్రీనివాసులు

నేను చనిపోయినా బతికే ఉంటాను.. ఏఐ డిజిటల్ క్లోన్‌పై ఆర్జీవీ సంచలన పోస్ట్

Select Suryaa Now
నేను చనిపోయినా బతికే ఉంటాను.. ఏఐ డిజిటల్ క్లోన్‌పై ఆర్జీవీ సంచలన పోస్ట్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ఆలోచనలతో సినీ, టెక్నాలజీ వర్గాల్లో చర్చకు తెరలేపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత సాయంతో తన కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ క్లోన్‌ను ఆయన తాజాగా సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. తాను చనిపోయిన తర్వాత కూడా ఈ డిజిటల్ క్లోన్ ద్వారా బతికే ఉంటానని, ఏ అంశంపై ఎవరు ఏ ప్రశ్న అడిగినా తన శైలిలో, తన ఆలోచనా విధానానికి అనుగుణంగా ఇది సమాధానం చెబుతుందని వర్మ పోస్ట్ చేశారు.

ఏఐ ఇంజనీర్ హరి గాడిపూడి ఈ డిజిటల్ క్లోన్‌ను రూపొందించినట్లు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఇది ప్రధానంగా రామూయిజం సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తుందని, దీని పనితీరును అర్థం చేసుకునేందుకు ప్రస్తుతం చిన్న సెషన్లను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. భవిష్యత్తు అప్‌డేట్‌లలో ఈ టెక్నాలజీ మరింత విస్తరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

రాబోయే వెర్షన్లలో ఈ డిజిటల్ క్లోన్ తన స్నేహితులను గుర్తుపట్టడంతో పాటు, తన అభిరుచికి తగ్గట్టుగా సినిమా కథలను రివ్యూ చేయడం, కొత్త కథలు రాయడం, పూర్తిస్థాయి నిడివి గల ఏఐ చిత్రాలను రూపొందించడం వంటివి కూడా చేస్తుందని ఆర్జీవీ వెల్లడించారు. తన ఆలోచనలను డిజిటల్ రూపంలో భవిష్యత్తు తరాలకు అందుబాటులో ఉంచేలా ఈ ప్రయోగం సాగుతోందని స్పష్టం చేశారు.

గత కొంతకాలంగా ఏఐ ప్రాముఖ్యత, మారుతున్న విద్యా విధానాలపై రామ్ గోపాల్ వర్మ వరుసగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కాలానికి తగ్గట్టుగా వ్యవస్థలు, విద్యా విధానాలు మారకపోతే ఏఐ ప్రభావం భారీగా ఉంటుందని హెచ్చరిస్తున్న ఆయన, ఇప్పుడు ఏకంగా తన డిజిటల్ క్లోన్‌ను ఆవిష్కరించడం నెట్టింట ఆసక్తికరంగా మారింది.