కార్తీక పౌర్ణమి వేడుకలు.. దనకొండేశ్వర స్వామి కొండపై భక్తుల దీపారాధన
పలమనేరు మేజర్ న్యూస్ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలమనేరు రూరల్ మండలం బైయపగారిపల్లి పంచాయతీ పరిధిలోని ఉసిరిపెంట గ్రామ సమీపాన ఉన్న దనకొండేశ్వర స్వామి కొండపై ఘనంగా దీపారాధన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ పూజారులు రమేష్, కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కొండపై పవిత్ర జ్యోతిని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దీపారాధనలో పాల్గొన్నారు. భక్తుల రాకతో కొండపై ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్తీక దీపాల వెలుగులతో కొండ ప్రాంతమంతా భక్తిమయంగా మారింది.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎం. శరణ్ కుమార్, వంశీ, మొగిలేశ్వర, చిక్లేశ్వర, శక్తి ప్రసాద్, వీహెచ్‌పీ నాయకులు గణేష్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
అనిల్ కుమార్ యాదవ్