వీ.కోటలో కూటమి అభ్యర్థి మధుకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం
పలమనేరు మేజర్ న్యూస్ మండల కేంద్రంలోని కూటమి సర్పంచ్ అభ్యర్థి మధును గెలిపించాలని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని, కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. కూటమి అభ్యర్థుల విజయంతో గ్రామాల అభివృద్ధికి మరింత కృషి చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.