BREAKING
బాక్సాఫీస్ వద్ద అవెంజర్స్ డూమ్స్‌డే సునామీ: విడుదలకు 3 వారాల ముందే 50 కోట్ల మార్క్! తొలిసారి వెస్ట్రన్ జానర్‌లోకి స్టీవెన్ స్పీల్‌బర్గ్: పాల్ థామస్ ఆండర్సన్‌తో భారీ ప్రాజెక్ట్! ప్రచారంలో దూసుకుపోతున్న స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి వై సతీష్ కుమార్ ఆర్ఆర్ఆర్ నాటు నాటు హుక్‌స్టెప్‌తో బీటీఎస్ వీ సందడి? అభిమానుల్లో ఉత్కంఠ! కార్తీక పౌర్ణమి వేడుకలు.. దనకొండేశ్వర స్వామి కొండపై భక్తుల దీపారాధన తుంగభద్ర నదీతీరంలో వైభవంగా పుణ్యహారతి.. లక్ష దీపోత్సవం గేటు వద్ద అడ్డుకున్న మేనేజర్.. కింద కూర్చుంటానన్న కోడి రామకృష్ణకు సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చిన సర్‌ప్రైజ్ ఇదే! కొంగటంలో కూటమి అభ్యర్థి విజయ్ కుమార్‌ను గెలిపించండి విజయం సాధిస్తే పంచాయతీ అభివృద్ధికి కోటి రూపాయల విరాళం – కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి ఓం శక్తి మహిళా భక్తులకు ఆరు రోజుల ఉచిత పుణ్యక్షేత్రాల యాత్ర నేను చనిపోయినా బతికే ఉంటాను.. ఏఐ డిజిటల్ క్లోన్‌పై ఆర్జీవీ సంచలన పోస్ట్ తరుణ్ భాస్కర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో ఉండేవాడినే కాదు.. 'ఈఎన్‌ఈ రిపీట్' వేడుకలో విశ్వక్ సేన్ ఎమోషనల్ స్పీచ్ వీ.కోటలో కూటమి అభ్యర్థి మధుకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం దర్శి లో 34 గ్రామపంచాయతీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఎల్లంపల్లి మురళి పలమనేరు ఆర్టీసీ కార్గోలో ఎలుకల బెడద డ్రై ఫ్రూట్స్ పార్సెల్ ధ్వంసం.. వినియోగదారుడికి నష్టం

తుంగభద్ర నదీతీరంలో వైభవంగా పుణ్యహారతి.. లక్ష దీపోత్సవం

Select Suryaa Now
తుంగభద్ర నదీతీరంలో వైభవంగా పుణ్యహారతి.. లక్ష దీపోత్సవం

మంత్రాలయం సూర్య ప్రతినిధి  కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో కార్తీక  పౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని తుంగభద్ర నదీతీరంలో శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామీజీ భక్తిశ్రద్ధలతో పవిత్ర నదీ హారతిని సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ స్వామి గోవింద్ దేవ్ గిరి జీ మహారాజ్ కూడా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వామీజీల సమక్షంలో నిర్వహించిన నదీ హారతి, శ్రీ ప్రహ్లాదరాజ ఉత్సవం తుంగభద్ర తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా చేశాయి.అనంతరం పవిత్ర తుంగభద్ర నదీతీరంలో లక్ష దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించారు. నదీతీరమంతా దీపకాంతులతో ప్రకాశించడంతో ఆ ప్రాంతమంతా దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్తీక దీపాల వెలుగులు భక్తులకు కనువిందు చేయడంతో పాటు భక్తి, పవిత్రతకు ప్రతీకగా నిలిచాయి.ఈ సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామీజీ భక్తులకు అనుగ్రహ సందేశాన్ని అందించి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని సూచించారు. అనంతరం శ్రీమఠం ప్రాకారంలో పవిత్ర జ్వాలా తోరణ కార్యక్రమాన్ని నిర్వహించి కార్తీక పౌర్ణమి వేడుకలకు సంప్రదాయబద్ధంగా ముగింపు పలికారు.
ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామీజీల ఆశీస్సులు పొందారు. నదీ హారతి, లక్ష దీపోత్సవం, జ్వాలా తోరణం వంటి పవిత్ర కార్యక్రమాలతో మంత్రాలయం పుణ్యక్షేత్రం భక్తి వైభవంతో కళకళలాడింది. ఈ వేడుకలు భక్తులకు ఆధ్యాత్మికంగా మరపురాని అనుభూతిని అందించాయి.

 నాగరాజు సూర్య ప్రతినిధి మంత్రాలయం కర్నూలు జిల్లా.