ప్రచారంలో దూసుకుపోతున్న స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి వై సతీష్ కుమార్
పలమనేరు మేజర్ న్యూస్ గంగవరం మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం వై సతీష్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బుట్ట గుర్తుకు ఓటు వేయాలని స్వతంత్ర అభ్యర్థి వై సతీష్ కుమార్ గ్రామ ప్రజలను అభ్యర్థించారు. ఇప్పటికే ప్రచారంలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు బుట్ట గుర్తుకు ఓటు వేయాలని కరపత్రాలు అందించి ఓటర్లను అభ్యర్థించారు. తాను గెలుపొందిన వెంటనే ఆడపడుచు పెళ్లి కానుక, గ్రామంలో త్రాగునీటి సమస్య లేకుండా చూడటం. గ్రామంలో నిత్యం పారిశుద్ధ్యం- పరిశుభ్రత, గుడి బడి నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ, గంగవరం గ్రామపంచాయతీలో ఉన్న ప్రతి గ్రామంలో డిగ్రీ,పీజీ విద్యార్థినీ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పై ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా డిగ్రీ, పీజీ పాసైన విద్యార్థినీ విద్యార్థులకు లాప్టాప్ ఉచితంగా ఇవ్వబడును. నేను తెలిపిన విధంగా అందరికీ మంచి చేయాలనే దృడ సంకల్పంతో రాజకీయాల్లోకి రావడం సంతరించుకుంది. తాను బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రావడం జరిగిందన్నారు. ప్రధానంగా స్మశానకి శాశ్వతంగా పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. గ్రామ ప్రజలు అందరూ బుట్ట గుర్తు నాలుగో నెంబర్ పై మీ పవిత్రమైన ఓటు వేయాలని వై. సతీష్ కుమార్ ఓటర్లను కోరారు.
అనిల్ కుమార్ యాదవ్