BREAKING
ఆర్ఆర్ఆర్ నాటు నాటు హుక్‌స్టెప్‌తో బీటీఎస్ వీ సందడి? అభిమానుల్లో ఉత్కంఠ! కార్తీక పౌర్ణమి వేడుకలు.. దనకొండేశ్వర స్వామి కొండపై భక్తుల దీపారాధన తుంగభద్ర నదీతీరంలో వైభవంగా పుణ్యహారతి.. లక్ష దీపోత్సవం గేటు వద్ద అడ్డుకున్న మేనేజర్.. కింద కూర్చుంటానన్న కోడి రామకృష్ణకు సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చిన సర్‌ప్రైజ్ ఇదే! కొంగటంలో కూటమి అభ్యర్థి విజయ్ కుమార్‌ను గెలిపించండి విజయం సాధిస్తే పంచాయతీ అభివృద్ధికి కోటి రూపాయల విరాళం – కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి ఓం శక్తి మహిళా భక్తులకు ఆరు రోజుల ఉచిత పుణ్యక్షేత్రాల యాత్ర నేను చనిపోయినా బతికే ఉంటాను.. ఏఐ డిజిటల్ క్లోన్‌పై ఆర్జీవీ సంచలన పోస్ట్ తరుణ్ భాస్కర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో ఉండేవాడినే కాదు.. 'ఈఎన్‌ఈ రిపీట్' వేడుకలో విశ్వక్ సేన్ ఎమోషనల్ స్పీచ్ వీ.కోటలో కూటమి అభ్యర్థి మధుకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం దర్శి లో 34 గ్రామపంచాయతీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఎల్లంపల్లి మురళి పలమనేరు ఆర్టీసీ కార్గోలో ఎలుకల బెడద డ్రై ఫ్రూట్స్ పార్సెల్ ధ్వంసం.. వినియోగదారుడికి నష్టం శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి బసిరెడ్డిపల్లి, బాలాయపల్లి పంచాయతీ లు ఏకగ్రీవం- గుర్రం శ్రీనివాసులు

తరుణ్ భాస్కర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో ఉండేవాడినే కాదు.. 'ఈఎన్‌ఈ రిపీట్' వేడుకలో విశ్వక్ సేన్ ఎమోషనల్ స్పీచ్

Select Suryaa Now
తరుణ్ భాస్కర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో ఉండేవాడినే కాదు.. 'ఈఎన్‌ఈ రిపీట్' వేడుకలో విశ్వక్ సేన్ ఎమోషనల్ స్పీచ్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌గా తెరకెక్కిన ఈఎన్‌ఈ రిపీట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తున్న వేళ, హీరో విశ్వక్ సేన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్ వేదికపై మాట్లాడిన ఆయన, దర్శకుడు తరుణ్ భాస్కర్ తన జీవితంలో చేసిన మేలును గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తరుణ్ భాస్కర్ లేకపోతే తాను ఈరోజు సినీ పరిశ్రమలో ఉండేవాడినే కాదని, పాతాళంలోకి వెళ్లిపోతున్న తనను కాలర్ పట్టుకుని పైకి లాగింది ఆయనేనని విశ్వక్ సేన్ ఉద్వేగంగా చెప్పారు.

కెరీర్ తొలినాళ్లలో తనను ఇండస్ట్రీ నుంచి తప్పించడానికి జరిగిన ఒక కుట్ర గురించి విశ్వక్ సేన్ ఈ వేదికపై బయటపెట్టారు. ఎనిమిదేళ్ల క్రితం ఈ నగరానికి ఏమైంది మొదటి భాగానికి తాను ఎంపికైన తర్వాత, గతంలో కాలేజీలో తనతో గొడవపడిన ఓ వ్యక్తి కక్ష పెంచుకున్నాడని తెలిపారు. ఆడిషన్లలో రిజెక్ట్ అయిన ఆగ్రహంతో ఓ అమ్మాయి పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీ సృష్టించి, విశ్వక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అతడిని సినిమాలో తీసుకుంటే మీడియా ముందు పరువు తీస్తామని తరుణ్ భాస్కర్‌కు బెదిరింపు మెయిల్ పంపాడని వెల్లడించారు.

ఆ సమయంలో వచ్చిన ఆరోపణలు, బెదిరింపుల నేపథ్యంలో తన పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన చెందానని, కానీ అసలు నిజం తెలుసుకున్న తరుణ్ భాస్కర్ తనకు అండగా నిలబడ్డారని విశ్వక్ సేన్ గుర్తు చేసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇవ్వడం వల్లే నటుడిగా తన ప్రయాణం సాధ్యమైందని, తన కెరీర్‌కు, జీవితానికి తరుణ్ భాస్కరే అసలైన హీరో అని కొనియాడారు.

ఈ నగరానికి ఏమైంది చిత్రంతో మొదలైన వీరి స్నేహబంధం, ఇప్పుడు ఈఎన్‌ఈ రిపీట్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేశ్ కాకుమాను, శివాత్మిక రాజశేఖర్ వంటి తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి లభిస్తున్న ఆదరణపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తోంది.