BREAKING
ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఎల్లంపల్లి మురళి పలమనేరు ఆర్టీసీ కార్గోలో ఎలుకల బెడద డ్రై ఫ్రూట్స్ పార్సెల్ ధ్వంసం.. వినియోగదారుడికి నష్టం శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి బసిరెడ్డిపల్లి, బాలాయపల్లి పంచాయతీ లు ఏకగ్రీవం- గుర్రం శ్రీనివాసులు శబరి శ్రీరామ క్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు.... కృష్ణానదిలో పుణ్యస్నానాలు.. ఆలయాల్లో కార్తీక దీపాల వెలుగులు కార్తీక మాసం సందర్భంగా కేతకీ సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు *మాజీ సీడీసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కాసాల బుచ్చిరెడ్డి జన్మదిన వేడుకలు* వాసిలి సర్పంచ్ గా సుంకర చౌదరి దివ్య కాంతులతో కార్తీక పౌర్ణమి..! వేదగిరి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచామృత అభిషేకాలు పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య *ప్రజల సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం* మంత్రి "ఆనం" ఇలాకాలో పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవాలు ఉపసంహరణల ఘట్టంలోనే 48 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు

Select Suryaa Now
శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు


 

 
 ఆగని బెల్టు అమ్మకాలు, శివనాధపురం, ఆర్టీసీ బస్టాండ్ బ్రాందీ షాపులలో బహిరంగంగా విక్రయాలు.
 
   శ్రీకాళహస్తి పట్టణం
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి అధికారులు పట్టణం మద్యం దుకాణాలకు సీలు వేసి మూసివేశారు. అయినప్పటికీ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో లక్కీ వైన్స్, మార్కెట్ ఎదురుగా ఉన్న లక్కీ బార్ ల వద్ద బెల్టు అమ్మకాలు బహిరంగంగా సాగుతున్నాయి. శివనాథపురం బ్రాందీ షాప్ లో 140 రూపాయలు ఉన్న సీపీ లిక్కర్ 180 రూపాయలకు విక్రియాలు జరుగుతున్నాయి.  ప్రైవేట్ డాక్టర్ ప్రసాద్ నాయుడు బ్రాందీ షాపులలో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నాడు. సీలు వేసిన దుకాణం ముందే దుకాణంలో పనిచేసేవారు బెల్టు అమ్ముతున్న దృశ్యాలు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేశాయి.బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతంలోనే నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుందా, లేక వారి కళ్లుగప్పి జరుగుతుందా అనేది తేలాల్సి ఉంది.నిబంధనలు ఉల్లంఘించి బెల్టు అమ్మకాలు సాగిస్తున్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి