BREAKING
ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఎల్లంపల్లి మురళి పలమనేరు ఆర్టీసీ కార్గోలో ఎలుకల బెడద డ్రై ఫ్రూట్స్ పార్సెల్ ధ్వంసం.. వినియోగదారుడికి నష్టం శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి బసిరెడ్డిపల్లి, బాలాయపల్లి పంచాయతీ లు ఏకగ్రీవం- గుర్రం శ్రీనివాసులు శబరి శ్రీరామ క్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు.... కృష్ణానదిలో పుణ్యస్నానాలు.. ఆలయాల్లో కార్తీక దీపాల వెలుగులు కార్తీక మాసం సందర్భంగా కేతకీ సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు *మాజీ సీడీసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కాసాల బుచ్చిరెడ్డి జన్మదిన వేడుకలు* వాసిలి సర్పంచ్ గా సుంకర చౌదరి దివ్య కాంతులతో కార్తీక పౌర్ణమి..! వేదగిరి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచామృత అభిషేకాలు పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య *ప్రజల సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం* మంత్రి "ఆనం" ఇలాకాలో పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవాలు ఉపసంహరణల ఘట్టంలోనే 48 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

శబరి శ్రీరామ క్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం

Select Suryaa Now
శబరి శ్రీరామ క్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం

 

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ 
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరులోని శబరి శ్రీ రామ క్షేత్రంలో మంగళవారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగాయి. పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం, సహస్ర దీపాలంకరణ సేవలను కనులపండువగా నిర్వహించారు.సంప్రదాయబద్ధంగా జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం నిర్వహించిన సహస్ర దీపాలంకరణ సేవలో భాగంగా వెలిగించిన దీపాల కాంతులతో శబరి శ్రీ రామ క్షేత్ర ప్రాంగణమంతా దేదీప్యమానంగా వెలుగొందింది.ఈ విశేష పూజా కార్యక్రమాలలో భక్తులు భక్తిపారవశ్యంతో పాల్గొని, సీతారాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి వేడుకలతో ఆలయ పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.