BREAKING
నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు మైనంపల్లి' సహాకారంతో పవర్ బోర్ వేయిస్తా : ఏకే మురుగేష్ ఉల్లిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఈమని అవినాష్ టీటీడీ స్థానిక ఆలయాల్లో కార్తీక దీపోత్సవం

సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు

Select Suryaa Now
సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ప్రముఖ దర్శకుడు సూరజ్ బర్జాత్యా కాంబినేషన్‌లో రానున్న ప్రేమ్ కీ షాదీ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తెరపైకి రావడానికి మరికొంత సమయం పడుతుందని సూరజ్ బర్జాత్యా తాజాగా వెల్లడించారు. కథకు సంబంధించి ఇంకా కొన్ని అంశాలను మెరుగుపరచాల్సి ఉందని, అందుకే కొంత సమయం తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

2022లో ఊంచాయ్ చిత్రం స్క్రీనింగ్ సందర్భంగా సల్మాన్ ఖాన్, సూరజ్ బర్జాత్యా తమ తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రేమ్ కీ షాదీ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు దర్శకుడు తెలపగా, సల్మాన్ ఖాన్ మరోసారి ప్రేమ్ పాత్రలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ప్రకటించారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై, ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి.

ప్రస్తుతం సూరజ్ బర్జాత్యా తాను దర్శకత్వం వహించిన యే ప్రేమ్ మోల్ లియా చిత్రం విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయుష్మాన్ ఖురానా, శర్వరీ జంటగా నటించిన ఈ కుటుంబ కథా చిత్రం నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా కూడా ప్రేమ్ అనే పాత్రలోనే కనిపించనుండటం విశేషం.

మరోవైపు సల్మాన్ ఖాన్ సైతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో ఆయన నటించిన యుద్ధ నేపథ్య చిత్రం మాతృభూమి డిసెంబర్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. దీనితో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నయనతారతో కలిసి మాన్‌స్టర్ అనే యాక్షన్ చిత్రంలోనూ సల్మాన్ నటిస్తున్నారు.