BREAKING
నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు మైనంపల్లి' సహాకారంతో పవర్ బోర్ వేయిస్తా : ఏకే మురుగేష్ ఉల్లిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఈమని అవినాష్ టీటీడీ స్థానిక ఆలయాల్లో కార్తీక దీపోత్సవం

స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు

Select Suryaa Now
స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు

ఆళ్లగడ్డ  మేజర్ న్యూస్; ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏఆర్ డిఎస్పి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఆళ్లగడ్డ మండల పరిధిలోని సమస్యాత్మక గ్రామమైన అహోబిలoలో పోలీసు కవాతు నిర్వహించారు. ఈనెల 26న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు. ఎవరూ అపోహలకు గురికాకుండా, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. రూరల్ సీఐ  రమణ మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఇప్పటికే పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. కావున ఓటర్లు తమ ఓటును ప్రశాంత వాతావరణంలో వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ సీఐ కృష్ణయ్య, ఆర్.ఎస్, ఐ . హర్ష వర్ధన్ రెడ్డి,45 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా