చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక
గడివేముల మేజర్ న్యూస్
గడివేముల మండలం చిందుకూరు గ్రామ సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ మద్దతు అభ్యర్థి సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంపంగి వెంకటస్వామి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం నాడు ఉపసంహరణ ప్రక్రియలో చిందుకూరు గ్రామానికి చెందినవారు ఎవరు నామినేషన్ వేయకపోవడంతో సంపంగి వెంకటస్వామి ఒకరే బరిలో మిగలడంతో చిందుకూరు గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సంపంగి వెంకట్ స్వామికి ఎన్నికల అధికారి పత్రాన్ని అందజేశారు. మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు గాను చిందుకూరు గ్రామపంచాయతీ తెలుగుదేశం పార్టీకి చెందిన సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి ఎన్నికల అధికారి సర్పంచుకు మరియు వార్డ్ మెంబర్లకు ప్రమాణ స్వీకారం చేయించారు.