1008 జ్యోతులతో మహాశివునికి విశేష పూజలు పాల్గొన్న ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్ ఛైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి
డోన్ పట్టణం, మేజర్ న్యూస్:పట్టణంలోని శ్రీషిరిడీ సాయిబాబా మందిరంలో కార్తీక పౌర్ణమి మహోత్సవాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్) ఛైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి, తెదేపా యువ నాయకులు ధర్మవరం మన్నె గౌతమ్‌కుమార్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జ్వాలాతోరణం, మహాశివునికి 1008 జ్యోతుల సమర్పణ, మంగళహారతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.