మీ ఇంటి ఆడపడుచుగా ఆశీర్వదించండి
- ఉంగరం గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి
- బైరెడ్డి బాలిరెడ్డి కోడలు సర్పంచ్ అభ్యర్థి కుమ్మిత భాగ్యలక్ష్మి విజ్ఞప్తి
పామూరు, మేజర్ న్యూస్ : వగ్గంపల్లి గ్రామ ప్రజలతో తనకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని మీ ఇంటి ఆడపడుచుగా పోటీ చేస్తున్న తనను ఆదరించి ఆశీర్వదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కుమ్మిత భాగ్యలక్ష్మి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వగ్గంపల్లి పంచాయతీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుసుకుని మద్దతు కోరారు. బైరెడ్డి బాలిరెడ్డి కోడలిగా మీ ముందుకు వస్తున్న తనకు గ్రామ ప్రజల ఆశీస్సులు, ఆదరణ అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ నెల 26న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రజలకు అవసరమైన సౌకర్యాల మెరుగుదలకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు. పదవి కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచానని ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. తనపై నమ్మకంతో ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించి గ్రామ సేవకు అవకాశం కల్పించాలని భాగ్యలక్ష్మి అభ్యర్థించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బైరెడ్డి బాలిరెడ్డి, కొండారెడ్డి,ఎలికా అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.