జంగంపేట రేణుక ఎల్లమ్మ ఆలయంలో గూడెం విక్రమ్ రెడ్డి ప్రత్యేక పూజలు
జిన్నారం;కార్తీక పౌర్ణమి సందర్భంగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు గూడెం విక్రమ్ రెడ్డి మంగళవారం జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని జంగంపేట రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సేరికారి వెంకట్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో విక్రమ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్ ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు రాజేష్, శ్రీనివాస్ గౌడ్, రామకృష్ణ, నిఖిల్ గౌడ్, నాగరాజు యాదవ్, మహేష్, శ్రీకాంత్ గౌడ్, అనిల్ , వినోద్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.