*ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డికి ఘనంగా సన్మానించిన కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లన్న పాటిల్*
కోహిర్;జహీరాబాద్ డివిజన్ నూతన వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల (రెగ్యులర్) కార్యాలయంలోని ఆత్మ కమిటీ చైర్మన్ ఛాంబర్లో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డిని కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లన్న పాటిల్ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రామలింగారెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆత్మ కమిటీ ద్వారా మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.