BREAKING
కార్తీక పౌర్ణమి వేళ కేతకి సంగమేశ్వరుడి ఆలయానికి పోటెత్తిన భక్తులు మొక్కు తీర్చుకునేందుకు యాదగిరిగుట్టకు పాదయాత్ర *నాగిరెడ్డిపల్లిలో చేయూత పెన్షన్లు, కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ* సంగారెడ్డి ప్రజల దాహం తీర్చాలి.. లేదంటే వాటర్ వార్‌కు సిద్ధం! అద్దంకి నియోజకవర్గంలో కూటమి జోరు.. ఐదు మండలాల్లో 37 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం. అయ్యప్ప స్వాములకు సంక్రాంతి వరకు అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన సాహితీ రాము… *సమాచార హక్కు చట్టంతో ప్రజలకు ప్రశ్నించే అధికారం* హుస్సేల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల రైడ్ అప్పుల బాధతో యువ రైతు బలవన్మరణం వెల్దుర్తి మండలం రామళ్లకోటలో విషాదం శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు *కార్తీక పౌర్ణమి సందర్భంగా రాచణ్ణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం* ప్రసన్నాంజనేయునికి వైభవంగా లక్ష తమలపాకుల పూజ. ఓటుతో అవకాశం ఇవ్వండి.. పనితీరుతో నమ్మకం నిలబెడతా జంగంపేట రేణుక ఎల్లమ్మ ఆలయంలో గూడెం విక్రమ్ రెడ్డి ప్రత్యేక పూజలు మీ ఓటుతో నన్ను గెలిపించండి

జహీరాబాద్‌లో అభివృద్ధి పనులకు ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ శంకుస్థాపన

Select Suryaa Now
జహీరాబాద్‌లో అభివృద్ధి పనులకు ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ శంకుస్థాపన

జహీరాబాద్;పట్టణ అభివృద్ధిలో భాగంగా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 8, 11వ వార్డుల్లో రూ.45 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ శంకుస్థాపన చేశారు. 8వ వార్డులో రూ.20 లక్షలు, 11వ వార్డులో రూ.25 లక్షలతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డా. ఏ. చంద్రశేఖర్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొహమ్మద్ యూనుస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొహమ్మద్ యూనుస్ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అంతర్గత రహదారుల నిర్మాణంతో ప్రజలకు రాకపోకల సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి సహకరిస్తున్న ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, డా. ఏ. చంద్రశేఖర్, డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు (రెగ్యులర్) జహీరాబాద్ డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నూతన కార్యాలయం ద్వారా రైతులకు వ్యవసాయ శాఖ సేవలు మరింత చేరువ కావడంతో పాటు వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి. ప్రభాకర్, డీఈ మహేష్, ఏఈలు వెంకటేష్, ఖాజా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ గౌడ్, సీడీసీ చైర్మన్ ముబీన్, వైస్ చైర్‌పర్సన్ శిరీష సురేందర్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.