నార్లాపురం సర్పంచ్ అభ్యర్థిగా పి. శ్రుతి
వెల్దుర్తి,మేజర్ న్యూస్ : వెల్దుర్తి మండలంలోని నార్లాపురం గ్రామ పంచాయతీ (ఎస్.వెంకటాపురం, నార్లాపురం గ్రామాలు) సర్పంచ్ అభ్యర్థిగా పెనికెలపాటి సంజీవరాయుడు కోడలు పి. శ్రుతి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. డిసెంబరు 2వ తేదీ బుధవారం నాడు పోలింగ్ జరగనుంది. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, రైతుల అభ్యున్నతి, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా తాము ముందుకు వస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
ఎన్నికల్లో విజయం సాధిస్తే గ్రామంలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పారిశుద్ధ్యం, సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్, నాణ్యమైన విత్తనాలు, పంటల బీమా, ప్రభుత్వ రాయితీలు అందేలా అధికారులతో సమన్వయం చేస్తామన్నారు. అర్హులందరికీ పింఛన్లు, ఆరోగ్య బీమా, రేషన్ వంటి సంక్షేమ పథకాలు అందేలా చూడటంతో పాటు రహదారుల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ, దేవాలయ అభివృద్ధి, బస్సు రవాణా సౌకర్యం, భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేసే అవకాశం కల్పించాలని, ఈ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని పెనికెలపాటి అశ్వర్థమయ్య కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఓటర్లను కోరారు.