ఆశీర్వదించండి అభివృద్ధికి అండగా నిలుస్తాం
- మానం రాజేశ్వరి, మల్లికార్జున దంపతుల ఓట్ల అభ్యర్థన
- మూడు గ్రామాల్లో వాహనంపై విస్తృత ప్రచారం
- కత్తెర గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి
పామూరు, మేజర్ న్యూస్ : తమను ఆశీర్వదించి సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని తూర్పు కోడిగుడ్లపాడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మానం రాజేశ్వరి ఆమె భర్త మానం మల్లికార్జున కోరారు. పంచాయతీ పరిధిలోని తూర్పు కోడిగుడ్లపాడు, జంగాలపల్లి, పోతవరం గ్రామాల్లో మంగళవారం వాహనంపై పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. 26న జరుగు పంచాయతీ ఎన్నికలలో కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ సమస్యల పరిష్కారానికి మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని దంపతులు పేర్కొన్నారు. తమకు ఒక్క అవకాశం కల్పించి ఆశీర్వదించాలని గ్రామ ప్రజలను కోరారు.