telangana
రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ
తెలంగాణ బ్యూరో ప్రతినిధి :రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత పెరిక సురేష్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై ఇరువురూ చర్చించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మెరుగుపడుతోందని, క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం అవుతోందని పెరిక సురేష్ వివరించినట్లు తెలిపారు.
రాబోయే ప్రతి ఎన్నికను లక్ష్యంగా చేసుకుని పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేస్తున్నాయని, ప్రజల్లో పార్టీకి ఆదరణ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధించగలదన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేసినట్లు పెరిక సురేష్ తెలిపారు