కొంపల్లి మేజర్ న్యూస్ జగద్గిరిగుట్ట గుట్టపై వెలసిన శ్రీ కార్తవీర్యార్జున స్వామి దేవాలయంలో ఎస్‌ఎస్‌కే సమాజ్ జగద్గిరిగుట్ట శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలని, జగద్గిరిగుట్ట ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు జైహింద్, కమిటీ సభ్యులు హనుమంత్ రావు, ఓం ప్రకాష్ (సన్నీ), దశరథ్, శివ, నాగేందర్, మాణిక్, రఘు తదితరులు పాల్గొన్నారు.