BREAKING
నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు మైనంపల్లి' సహాకారంతో పవర్ బోర్ వేయిస్తా : ఏకే మురుగేష్ ఉల్లిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఈమని అవినాష్ టీటీడీ స్థానిక ఆలయాల్లో కార్తీక దీపోత్సవం

వెలిగిన అరుణాచలం మహాదీపం; గిరి ప్రదక్షిణకు పోటెత్తిన లక్షలాది భక్తులు

Select Suryaa Now
వెలిగిన అరుణాచలం మహాదీపం; గిరి ప్రదక్షిణకు పోటెత్తిన లక్షలాది భక్తులు

తిరువణ్ణామలై: తమిళనాడులోని ప్రముఖ శైవక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మంగళవారం సాయంత్రం అరుణాచల కొండపై మహాదీపం దేదీప్యమానంగా వెలిగింది. 'అరుణాచల శివ.. అరుణాచల శివ' అనే భక్తుల నామస్మరణతో గిరి పరిసరాలు మారుమోగాయి.

ఈ మహాదీప దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అరుణాచల ఆలయానికి పోటెత్తారు. మహాదీపం వెలిగిన అనంతరం లక్షలాది మంది భక్తులు 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో భక్తిశ్రద్ధలతో పాల్గొంటున్నారు. భక్తుల రద్దీతో తిరువణ్ణామలై పట్టణంలోని వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమిళనాడు ప్రభుత్వం మరియు ఆలయ అధికారులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక వసతులు కల్పించారు.