ఎన్డీఏ కూటమిలోకి తిరిగి శిరోమణి అకాలీదళ్; స్వాగతించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన ప్రముఖ ప్రాంతీయ పార్టీ శిరోమణి అకాలీదళ్ (SAD) తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమిలోకి చేరింది. ఈ పరిణామంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ రాష్ట్ర అభివృద్ధి, పంజాబీల సంక్షేమమే తమ కూటమికి మొదటి ప్రాధాన్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఎన్డీఏ కుటుంబంలోకి శిరోమణి అకాలీదళ్ తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయడం ద్వారా పంజాబ్ ప్రగతికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై విభేదాలతో శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరు పార్టీలు తిరిగి చేతులు కలపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.