ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మద్యం షాపులు బంద్
రంపచోడవరం సూర్య ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలవరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రంపచోడవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధి లోనీ రంపచోడవరం, దేవీపట్నం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి ఉన్నటువంటి 08 మద్యం దుకాణాలకు, ఒక టిడి-1 బార్ కు మంగళవారం సాయంత్రం ఐదు గంటల కు సీలు వేయడం జరిగిందని, సదరు దుకాణాలను స్థానిక ఎన్నికలు లెక్కింపు పూర్తయిన అనంతరం ఈ నెల 26 వ తేదీ సాయంత్రం తెరుస్తారని పత్రిక ముఖంగా రంపచోడవరం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.