చీపురుపల్లి మేజర్ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే
చీపురుపల్లి మేజర్ న్యూస్: స్థానిక శాసనసభ్యులు కిమిడి కళా వెంకట రావు చీపురుపల్లి మేజర్ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మంగళవారం పాల్గొన్నారు. ఆయనతో పాటు కార్యక్రమంలో చీపురుపల్లి టీడీపీ పరిశీలకుడు పుచ్చ విజయకుమార్ కూడా హాజరయ్యారు. అంతకు ముందు 20 వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. చీపురుపల్లి మేజర్ పంచాయతీ అభ్యర్థి రౌతు కాము నాయుడు గెలుపును కాంక్షిస్తూ చీపురుపల్లి పట్టణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. స్థానిక ప్రజలు, ఓటర్లను కలిసి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వారితో పాటు జడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, ఆలయ కమిటీ చైర్మన్, ఎంపీటీసీ గవిడి నాగరాజు, మీసాల కాశీ విశ్వేశ్వరరావు, దన్నాన రామచంద్రుడు, సువ్వాడ అప్పలనాయుడు, రఘుపాత్రుని శివ, కింతలి మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా