BREAKING
తెలంగాణా ఒక ల్యాండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ హైకోర్టు న్యాయమూర్తులు విజయ్ సేన్ రెడ్డి,చలపతిరావు బలూచిస్తాన్‌లో మరో దారుణం: ఆరోగ్య కార్యకర్తను కిడ్నాప్ చేసిన పాకిస్థాన్ భద్రతా బలగాలు.. కేసీఆర్ కోసం పాదయాత్ర భర్త మృతితో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన.. న్యాయం చేయాలని అధికారులకు వినతి అంతర్జాతీయ స్థాయిలో 'రామాయణ' సత్తా.. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ షార్ట్‌లిస్ట్‌లో రెండు విభాగాల్లో చోటు ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా నిర్వహించాలి : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల నమోదు ప్రక్రియను గుంతల తో కూడిన రోడ్డు ప్రమాద స్థితిలో వాహనదారులు 'పొల్లాధవన్' సినిమాను 'బైసికల్ థీవ్స్'తో పోల్చడం అవమానమే.. వెట్రిమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు పి. కొత్తకోట పంచాయతీ సర్పంచిగా పరదేశి ఏకగ్రీవ ఎన్నిక ​పంచాయతీ అభివృద్ధి చేయడమే నా ధ్యేయం వెల్దుర్తిలో రసవత్తరంగా పంచాయతీ పోరు! బరిలో 152 మంది సర్పంచ్, 565 మంది వార్డు అభ్యర్థులు నామినేషన్ల పరిశీలన పూర్తి.. బొమ్మిరెడ్డిపల్లి, పుల్లగుమ్మిలో ఏకగ్రీవ దిశగా! అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి బాడంగి అభివృద్ధికి నిధులు.. ప్రతి ఇంటికీ తాగునీరు ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు హాలీవుడ్ దర్శకుడు ఆంటోనీ ఫుక్వాపై దావా.. బార్ మేనేజర్‌పై దాడి ఆరోపణలు కార్తీక పౌర్ణమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి దంపతులు కేపీహెచ్‌బీలో ఆకట్టుకున్న మంచు శివలింగం

ఘనంగా స్వామివారి కల్యాణోత్సవం

Select Suryaa Now
ఘనంగా స్వామివారి కల్యాణోత్సవం

దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానం నందు మంగళవారం నాడు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ దుర్గ భోగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ వెలిసిన ఐదు కోనేరులలో స్నానాలు ఆచరించి శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో దీపాలను వెలిగించారు. వచ్చిన భక్తులకు ఆర్యవైశ్య సత్రం నందు మరియు వడ్డే సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని ఆలయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొరటమద్ది గ్రామానికి చెందిన దే రెడ్డి విజయభాస్కర్ రెడ్డి మరియు ప్రమీలమ్మ దంపతులు ఆలయంలో వచ్చే భక్తుల కొరకు అన్నదానం నిర్వహించడానికి 10000 వేల రూపాయలను ఆలయ అధికారికి అందజేశారు. ఆలయ అభివృద్ధికి కరిమధ్యల గ్రామానికి చెందిన బాల మంజునాథ్రెడ్డి 5116 రూపాయలను ఆలయ అభివృద్ధి కొరకు ఆలయ అధికారికి అందజేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా జె ఎస్ డబ్బులు సిబ్బంది హరి శర్మ, వెంకటాచలం, సురేష్, భాస్కర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అధికారి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది రమణ, అర్చకులు శ్యాంసుందర్ శర్మ, గిరిధర్ శర్మ పాల్గొన్నారు.