ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల నమోదు ప్రక్రియను
తూప్రాన్;తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జెడ్పి సీఈవో ఎల్లయ్య పరిశీలించారు.ఈ సందర్భంగా ఫేజ్ 1 లో భాగంగా 10,11,12,14 మరియు 16 వ వార్డులలో నిర్వహిస్తున్న దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల వివరాల నమోదు, ఆధార్ మరియు రేషన్ కార్డు వివరాల ధృవీకరణ ప్రక్రియను సమీక్షించారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనాలు అందేలా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత మున్సిపల్ అధికారులు మరియు సిబ్బందికి సూచించారు.అలాగే దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నమోదు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.దరఖాస్తుల స్వీకరణ మొదటి రోజు నుండి 3వ రోజు వరకు 562 దరఖాస్తుల నమోదు జరిగినాయి కమీషనర్ రమేష్ కుమార్ తెలిపారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్, రమేష్ కుమార్, మేనేజర్ శ్రీకాంత్, ఎంపీడీవో శాలిక, మున్సిపల్ అధికారులు వార్డు ఆఫీసర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.