BREAKING
సైబరాబాద్‌లో మూడు రోజుల పాటు ఉచిత షటిల్ సర్వీసులు అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా సేవ చేస్తాం: శైలికా రెడ్డి గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు : రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఎన్నికల నిర్వహణపై డి.ఎస్.పి దిశానిర్దేశం .... పోలీసుల ఫ్లాగ్ మార్చ్ బ్రహ్మసముద్రం మండలం రాయలప్ప దొడ్డి గ్రామపంచాయతీలో తోడికోడల మధ్య పరస్పర పోరు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు, రెబల్గా ఒకరు పోటీ చేయుచున్నారు. సగరుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తా : ఎమ్మెల్యే గాంధీ జన్నారంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జయశంకర్ పార్కులో నూతన మంచినీటి బోర్ ప్రారంభం.పార్కు అభివృద్ధికి మరింత ప్రాధాన్యత: ఎమ్మెల్యే గాంధీ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు ప్రత్యేక పూజలు, దీపారాధనలతో ఆధ్యాత్మిక శోభ పాలసీలు, పరిపాలనలో పిల్లల గళానికి ప్రాధాన్యం ఇవ్వాలి: విజయవాడలో రాష్ట్రస్థాయి బాలల దినోత్సవ వేడుక *ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు* కార్తీక పౌర్ణమి వేళ అన్నవరంలో వైభవంగా జ్వాలాతోరణ మహోత్సవం విద్యారంగ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక ప్రాధాన్యత… క్షేత్రస్థాయిలో పర్యటించిన ఒంగోలు మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా పంపా హారతులు విపి రేగ ఘటనపై కిమిడి నాగార్జున దిగ్భ్రాంతి

రాయదుర్గంలో శ్రీ భక్త మార్కండేశ్వర స్వామికి ఘనంగా కేదారేశ్వర గౌరీ వ్రతం!!

Select Suryaa Now
రాయదుర్గంలో శ్రీ భక్త మార్కండేశ్వర స్వామికి ఘనంగా కేదారేశ్వర గౌరీ వ్రతం!!

రాయదుర్గం టౌన్ మేజర్ న్యూస్ :

రాయదుర్గం పట్టణంలో వెలసిన శ్రీ భక్త మార్కండేశ్వర స్వామి ఆలయంలో కేదారేశ్వర గౌరీ వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది,ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, అష్టోత్తర శతనామావళి బిల్వార్చన, గంగపూజ నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేసి, భక్తుల చేత వ్రతం చేయించారు.

శ్రీ భక్త మార్కండేశ్వర స్వామి చరిత్ర:

పురాణాల ప్రకారం మృకండు మహర్షి సంతానం కోసం పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమై, తెలివితక్కువవాడైనా దీర్ఘాయుష్షు గల కుమారుడు కావాలా, లేక మహా భక్తుడైనా 16 ఏళ్లు మాత్రమే జీవించే కుమారుడు కావాలా అని అడిగాడు. మహర్షి భక్తుడైన కుమారుడినే కోరుకున్నాడు. ఆ విధంగా జన్మించిన వాడే మార్కండేయుడు,16వ ఏట మార్కండేయుడిని తీసుకెళ్లేందుకు యముడు రాగా, మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని శివనామ స్మరణ చేశాడు. యమపాశం లింగంపై పడటంతో కోపించిన పరమశివుడు యముడిని సంహరించి, మార్కండేయుడికి చిరంజీవి వరాన్ని ప్రసాదించాడు. అందుకే భక్తుడైన మార్కండేయుని పేరుతో స్వామి "భక్త మార్కండేశ్వర స్వామి"గా పూజలందుకుంటున్నాడు, రాయదుర్గం పట్టణంలో వెలసిన ఈ స్వామిని దర్శిస్తే ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు, సుఖశాంతులు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే మహాశివరాత్రి, కార్తీక మాసం, కేదారేశ్వర గౌరీ వ్రతం వంటి పర్వదినాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు,పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి కృపతో పట్టణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని భక్తులు ప్రార్థించారు,అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు, అన్నదానం అందజేశారు.

ఈ కార్యక్రమం దేవరకొండ ఎర్రి స్వామి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది…