BREAKING
స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు మైనంపల్లి' సహాకారంతో పవర్ బోర్ వేయిస్తా : ఏకే మురుగేష్ ఉల్లిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఈమని అవినాష్ టీటీడీ స్థానిక ఆలయాల్లో కార్తీక దీపోత్సవం కార్తీక పౌర్ణమి వేళ కర్మన్‌ఘాట్‌ ఆలయంలో గవర్నర్‌ దంపతుల ప్రత్యేక పూజలు గోశాలను తొలగించేందుకు కుట్రలు శివ్ గోశాల అధ్యక్షుడు పి. జయరాం సిర్వి తెన్నేటి నాటక రచనలు ఆవిష్కరణ. ముమ్మరంగా కూటమి సర్పంచ్ అభ్యర్థి వెంకట కృష్ణారావు ఎన్నికల ప్రచారం వెలిగిన అరుణాచలం మహాదీపం; గిరి ప్రదక్షిణకు పోటెత్తిన లక్షలాది భక్తులు షీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుడు వనం వెంకటరమణకు నివాళులు

అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా సేవ చేస్తాం: శైలికా రెడ్డి

Select Suryaa Now
అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా సేవ చేస్తాం: శైలికా రెడ్డి

వెల్దుర్తి,  మేజర్ న్యూస్:రానున్న ఎన్నికల్లో తమకు ఒక్క అవకాశం కల్పిస్తే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నిస్వార్థంగా సేవ చేస్తామని వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి రమాకాంత్ రెడ్డి సతీమణి శైలికా రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆమె పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని అభ్యర్థించారు. ప్రజా నాయకుడు శివశంకర్ రెడ్డి ఆశయాలను నెరవేర్చడమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. గ్రామంలో నెలకొన్న వివిధ ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి, వెల్దుర్తి సమగ్ర అభివృద్ధికి పూర్తి అంకితభావంతో కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు.  ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. శైలికా రెడ్డి నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని మద్దతు తెలిపారు.