మామిడాడ సర్పంచ్ గా సూరిబాబు
పెదపూడి మేజర్ న్యూస్ : కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామ సర్పంచ్ ఎన్నికలు ప్రజలందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాయి.
గొల్లలమామిడాడ గ్రామ సర్పంచ్ గా జుత్తుక సూరిబాబు, ఉప సర్పంచ్ గా 15 వార్డుకు చెందిన మెంబర్ నేమాల దుర్గా భవాని, 1 వ వార్డు మెంబరుగా నల్లమిల్లి శ్రీదేవి, 2 వ వార్డు మెంబరుగా ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి, 3 వ వార్డు మెంబరుగా బేరా పద్మావతి, 4 వ వార్డు మెంబరుగా రొక్కల ఉష, 5వ వార్డు మెంబరుగా పెనుమచ్చి చంద్రకాంతం, 6 వ వార్డు మెంబరుగా బర్ల వీరేంద్రనాథ్ , 7 వ వార్డు మెంబరుగా కానూరి సంతోషి కుమారి,8 వ వార్డు మెంబరుగా ద్వారంపూడి వెంకటకృష్ణ శివప్రసాద్ రెడ్డి, 9వ వార్డు మెంబరుగా వల్లు లోవరాజు,10 వ వార్డు మెంబరుగా కేతా వీరభద్రం,11 వ వార్డు మెంబరుగా పలకా అశోక్ శివ కుమార్, 12 వ వార్డు మెంబరుగా వాసంశెట్టి విజయలక్ష్మి, 13 వ వార్డు మెంబరుగా పాతర్లపల్లి వెంకటలక్ష్మి, 14వ వార్డు మెంబరుగా మోర్త అబ్బులు, 16 వ వార్డు మెంబరుగా మిడతపాటి శివభాస్కరరావు లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పెదపూడి ఎంపిడిఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కొవ్వూరి నరేంద్ర రెడ్డి తెలిపారు. దీనితో పాటుగా గండ్రేడు, కుమారప్రియం, పెదపూడి గ్రామాలు కూడా పంచాయతీ పాలకవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు, మిగిలిన గ్రామాలకు ఈ నెల 29 వ తేదీన జరగనున్నట్లు ఆయన తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పాలకవర్గాలను ఎంఎల్ఎ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎఎంసి చైర్మన్ జుత్తుక సూర్య కుమారికృష్ణ, జెడ్ పిటిసి రావాడ నాగేశ్వరరావు, ఎంపిపి పుట్టా వీర వెంకట సత్యవేణి, వైస్ ఎంపిపి తమలంపూడి శివరామారెడ్డి, నాయకులు చింతా దొరబాబు, సత్తి భగవాన్ రెడ్డి, మండ రాజారెడ్డి తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.