రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన చినమట్లపూడి విద్యార్థులు
నగరం, మేజర్ న్యూస్: రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీల్లో స్థానిక మండల పరిధిలోని చినమట్లపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 23న జిల్లా స్థాయి పోటీల్లో "పర్యావరణం-వరి పొట్టు జీవవిచ్ఛిన్నమయ్యే ప్లేట్లు" అనే అంశం పై రూపొందించగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనది. విద్యార్థులు వరిపట్టు, తౌడు, చింత గింజల పొడి ఉపయోగించి పర్యావరణహితమైన భోజన ప్లేట్లను తయారు చేశారు. భోజనం తిన్న తర్వాత ఈ ప్లేట్లను భూమిలో కలిపితే ఎరువుగా మారుతుందని, ఈ విధంగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న వనరులను వాడుకోవచ్చని విద్యార్థులు నిరూపించారు. జిల్లా విద్యాశాఖ అధికారి డి. శ్రీనివాస్ విద్యార్థులను అభినందించి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ మేరకు మంగళవారం పాఠశాలలో విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు ఎస్ కె షకీనా, గైడ్ టీచర్ పి. సంధ్యారాణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.