telangana
తెన్నేటి నాటక రచనలు ఆవిష్కరణ.
ముషీరాబాద్ మేజర్ న్యూస్ :సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ అన్నారు శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై వంశీ ఆర్ట్స్ థియేటర్స్ నిర్వహణలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ తెన్నేటి సుధా దేవి రచించిన తంత్ర సామెతం వీధి నాటిక అరవింద నాటిక ల సంకలనం ఆవిష్కరణ జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ మాట్లాడుతూ సుధా దేవి తెలుగు అకాడమీ లో డిప్యూటీ డైరెక్టర్ హోదా లో గతం లో పని చేసిన కాలం లో నిబద్ధత కలిగిన ఉద్యోగి గా గుర్తింపు పొందారు అన్నారు ఆమె చేసిన సాహితీ సేవ అపురూపం అని ప్రశంసించారు సంపుటి ఆవిష్కరణ చేసిన ప్రముఖ నటుడు సుబ్బరాయ శర్మ మాట్లాడుతూ సుధా దేవి సుమారు 700 తెలుగు సామెతలను ఉదహరిస్తూ కథలు రాయటం గొప్ప ప్రయత్నం అని చెప్పారు ఆవిడ జీవించి ఉన్న సమయం లో ఆమె కోరిక మేరకు ఆ కథలు నాటకీకరణ చేసి ప్రదర్శనలు చేసే సమయానికి ఆమె మృతి చెందటం బాధా కరం అన్నారు తెలుగు అకాడెమీ పూర్వ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆవుల మంజులత మాట్లాడుతూ అమెరికా లో తెలుగు వ్యాప్తి గురించి చిటిన్ రాజు గొప్ప పరిశోధనాత్మక వ్యాసం రాసారు అని దానినీ గ్రంధ రూపం లో వెలుగు లోకి తెస్తే చాలా ఉపయోగం అని చెప్పారు సుధా దేవి సహన శీలి కార్యాదక్షత ఉన్న మహిళా మూర్తి అని కొని యాడారు వేదిక పై రమా చంద్ర మౌళి కె శారద వాణి ఉప్పల శశి మోహన్ తదితరులు పాల్గొన్నారు స్వాగతం పలికిన వంశీ రామరాజు చైనా లో జరిగిన తెలుగు మహా సభలని నిర్వాహకుడు చిట్టెన్ రాజు రచయిత్రి సుధా దేవి కి అంకితం ఇచ్చారనీ ఇందుకు ధన్యవాదాలు గా నాటికలు సంపుటి నీ ఆయనకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు శైలజ సుంకర పల్లి సుధా మయి పర్యవేక్షణ చేశారు తొలుత శ్రీజ సాదినేని దర్శకత్వం లో చిట్టెన్ రాజు రచించిన అసలు ప్రశ్న నాటిక ప్రదర్శించారు