national
కార్తీక పౌర్ణమి వేళ కర్మన్‌ఘాట్ ఆలయంలో గవర్నర్ దంపతుల ప్రత్యేక పూజలు
హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి : కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లాతో కలిసి హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కర్మన్‌ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు, అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులు పరమశివుడు, శ్రీ ఆంజనేయస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు లోక్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.