BREAKING
స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు మైనంపల్లి' సహాకారంతో పవర్ బోర్ వేయిస్తా : ఏకే మురుగేష్ ఉల్లిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఈమని అవినాష్ టీటీడీ స్థానిక ఆలయాల్లో కార్తీక దీపోత్సవం కార్తీక పౌర్ణమి వేళ కర్మన్‌ఘాట్‌ ఆలయంలో గవర్నర్‌ దంపతుల ప్రత్యేక పూజలు గోశాలను తొలగించేందుకు కుట్రలు శివ్ గోశాల అధ్యక్షుడు పి. జయరాం సిర్వి తెన్నేటి నాటక రచనలు ఆవిష్కరణ. ముమ్మరంగా కూటమి సర్పంచ్ అభ్యర్థి వెంకట కృష్ణారావు ఎన్నికల ప్రచారం వెలిగిన అరుణాచలం మహాదీపం; గిరి ప్రదక్షిణకు పోటెత్తిన లక్షలాది భక్తులు షీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుడు వనం వెంకటరమణకు నివాళులు

రవీంద్ర భారతిలో ది మిషన్ 11వ వార్షికోత్సవ వేడుకలు

Select Suryaa Now
రవీంద్ర భారతిలో ది మిషన్ 11వ వార్షికోత్సవ వేడుకలు
రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ 24: విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ జాతీయ అధ్యక్షుడు మారమోని శ్రీశైలం యాదవ్ అన్నారు. ది మిషన్ సంస్థ 11వ వార్షికోత్సవ వేడుకలు రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మారమోని శ్రీశైలం మాట్లాడుతూ.. ది మిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎక్సైజ్ సీఐ కొట్టే ఏడుకొండలు ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత పోటీ పరీక్షల శిక్షణ అందించడంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు.  
 విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడం, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేసి ధర్మాన్ని కాపాడడం ప్రకృతి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం తదితర అంశాలపై 
 చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఉన్నత ఉద్యోగాలను సాధించలనే ఉద్దేశంతో ది మిషన్ గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించడం విశేషమని పలువురు అభినందించారు. ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా అవకాశాలకు దూరమవుతున్న విద్యార్థులకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని పేర్కొన్నారు.వేడుకలకు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు, సేవా రంగానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.