BREAKING
*బొల్లారంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు* *కోహీర్ ప్రధాన రహదారికి కొత్త వెలుగులు.. ప్రజల భద్రతకు భరోసా!* హిట్ అయ్యే సినిమాలైనా వదులుకుంటా.. టాక్సిక్ లవ్‌పై ఆయుష్మాన్ ఖురానా ఆసక్తికర వ్యాఖ్యలు! హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన దుబాయ్ పెళ్లి వేడుకలో హనీ సింగ్, అతీఫ్ అస్లాం స్టెప్పులు.. పాక్ కంటెంట్ వివాదం వేళ నెట్టింట రచ్చ! తేరే నామ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు.. భోజ్‌పురి సినిమాతో మారిన దశ: రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు! న్యాల్‌కల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - లబ్ధిదారుల్లో ఆనందం కాలుష్య కొరల్లో మల్లి పల్లి చేరువు వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! ఉపాధి పనులను వేగవంతం చేయాలి.. -డీఆర్డీవో జయదేవ్ ఆర్య నిర్మాత డబ్బులు ఎగ్గొడితే టేప్ రికార్డర్ పట్టుకెళ్లా.. అక్షయ్ కుమార్ ఆసక్తికర కథ! ఇటాలియా టీ10 లీగ్‌లో విజయ్ శంకర్ జోరు.. వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు! *ఇందిరమ్మ జీవిత బీమా పథకంను ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ పిల్లి బాబు* పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇండ్లు.. కుటుంబ భవిష్యత్తుకు రూ.5 లక్షల బీమా భరోసా! యాసంగి సాగు విధానాలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి

కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు ప్రత్యేక పూజలు, దీపారాధనలతో ఆధ్యాత్మిక శోభ

Select Suryaa Now
కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు  ప్రత్యేక పూజలు, దీపారాధనలతో ఆధ్యాత్మిక శోభ

చిట్టమూరు మేజర్ న్యూస్

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిట్టమూరు మండలంలోని మల్లాం, చిట్టమూరు,పలు గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తుల రాక పెరిగింది.ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.కార్తీక దీపాలు వెలిగించి కుటుంబాల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.భక్తులకు అవసరమైన వసతులు కల్పించడంతో పాటు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తుల సందడితో కళకళలాడాయి.

అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్