BREAKING
*బొల్లారంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు* *కోహీర్ ప్రధాన రహదారికి కొత్త వెలుగులు.. ప్రజల భద్రతకు భరోసా!* హిట్ అయ్యే సినిమాలైనా వదులుకుంటా.. టాక్సిక్ లవ్‌పై ఆయుష్మాన్ ఖురానా ఆసక్తికర వ్యాఖ్యలు! హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన దుబాయ్ పెళ్లి వేడుకలో హనీ సింగ్, అతీఫ్ అస్లాం స్టెప్పులు.. పాక్ కంటెంట్ వివాదం వేళ నెట్టింట రచ్చ! తేరే నామ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు.. భోజ్‌పురి సినిమాతో మారిన దశ: రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు! న్యాల్‌కల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - లబ్ధిదారుల్లో ఆనందం కాలుష్య కొరల్లో మల్లి పల్లి చేరువు వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! ఉపాధి పనులను వేగవంతం చేయాలి.. -డీఆర్డీవో జయదేవ్ ఆర్య నిర్మాత డబ్బులు ఎగ్గొడితే టేప్ రికార్డర్ పట్టుకెళ్లా.. అక్షయ్ కుమార్ ఆసక్తికర కథ! ఇటాలియా టీ10 లీగ్‌లో విజయ్ శంకర్ జోరు.. వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు! *ఇందిరమ్మ జీవిత బీమా పథకంను ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ పిల్లి బాబు* పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇండ్లు.. కుటుంబ భవిష్యత్తుకు రూ.5 లక్షల బీమా భరోసా! యాసంగి సాగు విధానాలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి

సైబరాబాద్‌లో మూడు రోజుల పాటు ఉచిత షటిల్ సర్వీసులు

Select Suryaa Now
సైబరాబాద్‌లో మూడు రోజుల పాటు ఉచిత షటిల్ సర్వీసులు
కొండాపూర్,మేజర్ న్యూస్ : సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం Cityflo ఉచిత షటిల్ సర్వీసులను అందించనుంది. సైబరాబాద్ మూవ్స్–2026లో భాగంగా నవంబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. సైబరాబాద్ పోలీస్, మున్సిపల్ కార్పొరేషన్, SCSC సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు Cityflo భాగస్వామిగా వ్యవహరిస్తోంది.టీ-హబ్ కేంద్రంగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలను కలుపుతూ రెండు రూట్లలో షటిళ్లు నడపనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రతి 20-30 నిమిషాలకు రాకపోకలు సాగిస్తాయి. మొదటి రూట్‌లో TCS కోహినూర్ పార్క్ నుంచి టీ-హబ్ వరకు, రెండో రూట్‌లో వేవ్‌రాక్ నుంచి టీ-హబ్ వరకు సర్వీసులు అందిస్తారు. మార్గమధ్యంలో ప్రముఖ ఐటీ సంస్థలు, కార్యాలయ సముదాయాల వద్ద బస్సులు ఆగుతాయి.సదస్సుకు హాజరయ్యే వారంతా ఈ ఉచిత సేవలను వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. బోర్డింగ్ పాయింట్లు, సమయాల వివరాలు Cityflo యాప్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.సైబరాబాద్ ఐటీ హబ్‌లలో ప్రజా రవాణాను ప్రోత్సహించి, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని Cityflo సహ వ్యవస్థాపకుడు సంకల్ప్ కెల్షికర్ తెలిపారు. 'రండి.. మీ అడుగు వేయండి!' నినాదంతో నవంబర్ 26 నుంచి 28 వరకు టీ-హబ్‌లో సైబరాబాద్ మూవ్స్–2026 నిర్వహించనున్నారు. సుస్థిరమైన పట్టణ రవాణా, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థపై ఈ సదస్సులో చర్చించనున్నారు