విపి రేగ ఘటనపై కిమిడి నాగార్జున దిగ్భ్రాంతి
చీపురుపల్లి మేజర్ న్యూస్: గరివిడి మండలం వి.పి. రేగ గ్రామంలో గెడ్డలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటనపై విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎర్రవెల్లి వర్ష (4), ఎర్రవెల్లి ధనుష్ (7) ప్రమాదవశాత్తు గెడ్డలో పడి మృతి చెందడం తీవ్ర విషాదకరమని పేర్కొన్నారు. చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతమని నాగార్జున అన్నారు. ఈ విషాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. వర్ష, ధనుష్‌ల మృతి ఆ కుటుంబానికి తీరని లోటని నాగార్జున పేర్కొన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. చిన్నారుల భద్రత విషయంలో తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా