BREAKING
స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు మైనంపల్లి' సహాకారంతో పవర్ బోర్ వేయిస్తా : ఏకే మురుగేష్ ఉల్లిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఈమని అవినాష్ టీటీడీ స్థానిక ఆలయాల్లో కార్తీక దీపోత్సవం కార్తీక పౌర్ణమి వేళ కర్మన్‌ఘాట్‌ ఆలయంలో గవర్నర్‌ దంపతుల ప్రత్యేక పూజలు గోశాలను తొలగించేందుకు కుట్రలు శివ్ గోశాల అధ్యక్షుడు పి. జయరాం సిర్వి తెన్నేటి నాటక రచనలు ఆవిష్కరణ. ముమ్మరంగా కూటమి సర్పంచ్ అభ్యర్థి వెంకట కృష్ణారావు ఎన్నికల ప్రచారం వెలిగిన అరుణాచలం మహాదీపం; గిరి ప్రదక్షిణకు పోటెత్తిన లక్షలాది భక్తులు షీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుడు వనం వెంకటరమణకు నివాళులు

కోటనందూరు సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున అంకమరెడ్డి రాజేష్!

Select Suryaa Now
కోటనందూరు సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున అంకమరెడ్డి రాజేష్!

- గ్రామానికి మౌలిక వసతులు.. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం.. యువతకు క్రీడా ప్రాంగణాల ఏర్పాటు లక్ష్యం

కోటనందూరు, మేజర్ న్యూస్ : కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున అంకమరెడ్డి రాజేష్ ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు.

తాను సర్పంచ్‌గా ఎన్నికైతే కోటనందూరు గ్రామానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ఆరోగ్యపరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.

గ్రామ ప్రజలు తనకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే, తాను ప్రకటించిన 18 అంశాలు, స్మశాన వాటిక, డ్రైనేజీ వ్యవస్థ, ఆర్టీసీ కాంప్లెక్స్, క్రీడా ప్రాంగణాలు వీధిలైట్లు మొదలగు అభివృద్ధి అంశాలను నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని అంకమరెడ్డి రాజేష్ మాట ఇచ్చారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతో కోటనందూరు గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన సంకల్పమని ఆయన వెల్లడించారు.