జయశంకర్ పార్కులో నూతన మంచినీటి బోర్ ప్రారంభం.పార్కు అభివృద్ధికి మరింత ప్రాధాన్యత: ఎమ్మెల్యే గాంధీ
హఫీజ్పేట్,మేజర్ న్యూస్ : హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో ఉన్న జయశంకర్ పార్కులో నూతన భూగర్భ జల గొట్టపు బావి (మంచినీటి బోర్)ను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ,మంగళవారం తాజా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి, మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్కులో నూతన మంచినీటి బోర్ ఏర్పాటు చేయడం సంతోషకరమని, ఇది మొక్కల సంరక్షణకు, పార్కు నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.భూగర్భ జలాల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొంటూ, ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.జయశంకర్ పార్కులో వాకర్లకు, వృద్ధులకు అవసరమైన సదుపాయాలతో పాటు చిన్నారుల కోసం ఆటవిడుపు పరికరాలు, పుస్తక పఠనం కోసం లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్కును మరింత సుందరంగా, ఆహ్లాదకరమైన వాతావరణంతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, హఫీజ్పేట్ డివిజన్ అభివృద్ధికి నిరంతరం ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.