*ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు*
అల్లాదుర్గం;మండలంలోని ఆయా గ్రామాలలో కార్తీక పౌర్ణమి వేడుకలు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుండి భక్తులు కార్తీక స్నానం ఆచరించి ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం అల్లాదుర్గంలో వీరభద్ర స్వామి, వెంకటేశ్వర స్వామి, మార్కండేయ, ఈశ్వరుని ముస్లాపూర్ గ్రామంలోని ఈశ్వరుని దేవాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపారాధన చేశారు. పురోహితులు శీలం కోట ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో వెంకటేశ్వర ముస్లాపూర్ ఈశ్వరుని ఆలయంలో జంగం శివరాజ్ ఆధ్వర్యంలోదేవాలయంలో ఆకాశదీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు ఆకాశ దీపోత్సవాన్ని తిలకించడానికి తండోపతండాలుగా తరలివచ్చారు. దేవాలయం భక్తులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.