విద్యారంగ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక ప్రాధాన్యత… క్షేత్రస్థాయిలో పర్యటించిన ఒంగోలు మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం లక్ష్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తీసుకుంటున్న చొరవకు అనుగుణంగా, ఈరోజు ఒంగోలు నగర మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప గారు నగరంలోని పీవీఆర్ సెంటర్ నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని భవనాలు, మౌలిక వసతులను స్వయంగా పరిశీలించి, విద్యార్థినులతో ఆప్యాయంగా మాట్లాడి వారి చదువులు, ఎదుర్కొంటున్న సమస్యలు, పాఠశాలలోని పరిస్థితుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ప్రధానోపాధ్యాయురాలితో సమావేశమై పాఠశాలలో నెలకొన్న సమస్యలు, విద్యార్థినులకు అవసరమైన సౌకర్యాల గురించి సమగ్రంగా తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పదవి అంటే అధికారం మాత్రమే కాదు… ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, పరిష్కారం దిశగా అడుగులు వేయడం నిజమైన ప్రజాసేవ!
ఒంగోలు నగర అభివృద్ధితో పాటు విద్యా సంస్థల అభ్యున్నతి, విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ మేయర్ శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప గారు సాగిస్తున్న ఈ పర్యటన ఆమె బాధ్యతాయుతమైన పాలనా విధానానికి నిదర్శనం.
విద్యార్థుల భవిష్యత్తే నగర భవిష్యత్తు… విద్యకు ప్రాధాన్యత, అభివృద్ధికి నిబద్ధతతో ఒంగోలు నగరం ముందుకు సాగాలి!