సగరుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తా : ఎమ్మెల్యే గాంధీ
శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ : సగరుల న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సగర ఆధ్వర్యంలో సగర సంఘం నాయకులు మంగళవారం వివేకానందనగర్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.సగర ఫెడరేషన్‌ను కార్పొరేషన్‌గా మార్చి పాలకమండలి నియమించాలని, జీవో 59 సవరించి కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు పెంచాలని, నిర్మాణ రంగ కార్మికులుగా గుర్తించి ఆరోగ్య భద్రత కార్డులు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ట్యాంక్‌బండ్‌పై భగీరథ మహర్షి విగ్రహం ఏర్పాటు చేయాలని, బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ.. చట్టసభల్లో సగరులకు ప్రాతినిధ్యం లేకపోవడంతో తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనూ అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. స్పందించిన ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సగరుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైతే శాసనసభలో ప్రస్తావిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర సంఘం కోశాధికారి కానుగంటి శ్రీనివాస్ సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకట్రాములు సగర, గ్రేటర్ యువజన సంఘం మాజీ అధ్యక్షుడు ఎర్రంశెట్టి సీతారాం సగర, అంజయ్య నగర్, హఫీజ్‌పేట్, కొండాపూర్, లింగంపల్లి, రాయదుర్గం తదితర ప్రాంతీయ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, నాయకులు, నియోజకవర్గానికి చెందిన పెద్ద సంఖ్యలో సగర బంధువులు పాల్గొన్నారు.