46వ డివిజన్‌లో దోమల నివారణకు ఫాగింగ్
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపురం నగరంలోని 46వ డివిజన్‌లో దోమల బెడదను నివారించేందుకు కార్పొరేటర్ ఖాజా వలి షేక్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
డివిజన్‌లో దోమల సమస్య తీవ్రంగా ఉందని గుర్తించిన ఆయన, ఈ విషయాన్ని ఎంహెచ్ఓ రవీంద్ర దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు 46వ డివిజన్‌లో ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్యం మరియు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ ఖాజా వలి షేక్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యమే తన ప్రథమ ప్రాధాన్యతని, డివిజన్ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
“ నిరంతరం ముందుంటానని పేర్కొన్నారు.