కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో అన్నదాన కార్యక్రమం లో ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న నాయకులు వి.చంద్రారెడ్డి, పి.జైపాల్ రెడ్డి
జిన్నారం;బొల్లారం డివిజన్‌లోని మల్లిఖార్జున స్వామి,పూరి జగన్నాధ్ ఆలయాల్లో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వి.చంద్రారెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.జైపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ.. కార్తీక పౌర్ణమి పర్వదినాన బోళాశంకరుడైన పరమశివుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖ:సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు రాజు నాయక్, యువజన నాయకులు వి.ప్రవీణ్ రెడ్డి, పద్మ, నవీన్, ఆకాష్, అరూప్, మోహన్, శివ, సురేష్, ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి పూజలతో బొల్లారం డివిజన్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్యక్రమంలో నిర్వాహకులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.