BREAKING
స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు మైనంపల్లి' సహాకారంతో పవర్ బోర్ వేయిస్తా : ఏకే మురుగేష్ ఉల్లిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఈమని అవినాష్ టీటీడీ స్థానిక ఆలయాల్లో కార్తీక దీపోత్సవం కార్తీక పౌర్ణమి వేళ కర్మన్‌ఘాట్‌ ఆలయంలో గవర్నర్‌ దంపతుల ప్రత్యేక పూజలు గోశాలను తొలగించేందుకు కుట్రలు శివ్ గోశాల అధ్యక్షుడు పి. జయరాం సిర్వి తెన్నేటి నాటక రచనలు ఆవిష్కరణ. ముమ్మరంగా కూటమి సర్పంచ్ అభ్యర్థి వెంకట కృష్ణారావు ఎన్నికల ప్రచారం వెలిగిన అరుణాచలం మహాదీపం; గిరి ప్రదక్షిణకు పోటెత్తిన లక్షలాది భక్తులు షీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుడు వనం వెంకటరమణకు నివాళులు

కాంగ్రెస్ శ్రేణులకు 60:40 నిష్పత్తిలో పదవులు.. మంత్రి శ్రీధర్‌బాబు హామీ

Select Suryaa Now
కాంగ్రెస్ శ్రేణులకు 60:40 నిష్పత్తిలో పదవులు.. మంత్రి శ్రీధర్‌బాబు హామీ

చేవెళ్ల: చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలు, పదవుల కేటాయింపులో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై భీమ్‌భరత్‌ వర్గం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆశ్రయించింది. మంగళవారం మంత్రి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి భీమ్‌భరత్‌ తన వర్గీయులతో కలిసి పార్టీ శ్రేణుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జెండా మోసి, రాత్రింబవళ్లు కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు నియోజకవర్గంలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించడం లేదని భీమ్ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్‌లతో పాటు ఇతర నామినేటెడ్, పార్టీ పదవులను కాంగ్రెస్ కోసం కష్టపడిన వారికి కేటాయించాలని కోరారు.

దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఇరువర్గాల నాయకులను ఒకచోట కూర్చోబెట్టి సమన్వయం చేస్తామని, 60:40 నిష్పత్తిలో నామినేటెడ్, పార్టీ పదవుల కేటాయింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో భీమ్‌భరత్‌ వర్గీయుల్లో ఆశలు చిగురించాయి.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నేతలు గౌరీ సతీష్, చింపుల సత్యనారాయణ రెడ్డి, చేవెళ్ల ఇంచార్జ్  పామెన భీమ్ భరత్, పార్టీ సీనియర్ నాయకులు జూకన్న గారి శ్రీకాంత్ రెడ్డి, గోటూరి రామచంద్రయ్య గౌడ్, పడాల రాములు, గుండాల రాములు, బండారు వెంకటరెడ్డి, చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్, నవాబుపేట, షాబాద్ మండలాలకు చెందిన భీమ్‌భరత్‌ వర్గీయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.