BREAKING
*బొల్లారంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు* *కోహీర్ ప్రధాన రహదారికి కొత్త వెలుగులు.. ప్రజల భద్రతకు భరోసా!* హిట్ అయ్యే సినిమాలైనా వదులుకుంటా.. టాక్సిక్ లవ్‌పై ఆయుష్మాన్ ఖురానా ఆసక్తికర వ్యాఖ్యలు! హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన దుబాయ్ పెళ్లి వేడుకలో హనీ సింగ్, అతీఫ్ అస్లాం స్టెప్పులు.. పాక్ కంటెంట్ వివాదం వేళ నెట్టింట రచ్చ! తేరే నామ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు.. భోజ్‌పురి సినిమాతో మారిన దశ: రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు! న్యాల్‌కల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - లబ్ధిదారుల్లో ఆనందం కాలుష్య కొరల్లో మల్లి పల్లి చేరువు వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! ఉపాధి పనులను వేగవంతం చేయాలి.. -డీఆర్డీవో జయదేవ్ ఆర్య నిర్మాత డబ్బులు ఎగ్గొడితే టేప్ రికార్డర్ పట్టుకెళ్లా.. అక్షయ్ కుమార్ ఆసక్తికర కథ! ఇటాలియా టీ10 లీగ్‌లో విజయ్ శంకర్ జోరు.. వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు! *ఇందిరమ్మ జీవిత బీమా పథకంను ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ పిల్లి బాబు* పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇండ్లు.. కుటుంబ భవిష్యత్తుకు రూ.5 లక్షల బీమా భరోసా! యాసంగి సాగు విధానాలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి

కార్తీక పౌర్ణమి వేళ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం.. శంభీపూర్ క్రిష్ణ ప్రత్యేక పూజలు*

Select Suryaa Now
కార్తీక పౌర్ణమి వేళ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం.. శంభీపూర్ క్రిష్ణ ప్రత్యేక పూజలు*
 దుండిగల్ మేజర్ న్యూస్ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ మిత్రులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందని శంభీపూర్ క్రిష్ణ తెలిపారు. అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ప్రజలంతా ప్రశాంతంగా, సుభిక్షంగా జీవించాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల సందడి నెలకొనగా, అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన శంభీపూర్ క్రిష్ణ, ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.